ధర్పల్లి ఎస్సై సందీప్‌కు సర్పంచ్ సన్మానం
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలి: ఎస్సై సందీప్…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ఎస్సై జి. సందీప్‌ను దుబ్బాక గ్రామ సర్పంచ్ సరోజినీ దేవి గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై సందీప్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎస్సై సందీప్ మాట్లాడుతూ గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల సహకారంతో గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.

























