Homeతెలంగాణపేదల భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి...

పేదల భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి…

పేదల భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

నవంబర్ 2న ఛలో సబ్‌ కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

AIUKS రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి. దేవరాం పిలుపు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్‌గల్, పేద ప్రజల భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి, వారికి భూములపై హక్కులు కల్పించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (AIUKS) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలందరికీ ఎలాంటి జాప్యం లేకుండా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం నవంబర్ 2న నిర్వహించనున్న ఛలో సబ్‌ కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని AIUKS రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి. దేవరాం పిలుపునిచ్చారు.

బుధవారం భీమ్‌గల్ మండలంలోని తాళ్లపల్లి చౌరస్తాలో AIUKS ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల సమావేశంలో వి. ప్రభాకర్ మాట్లాడుతూ, పేదలు సాగు చేసుకుంటున్న, నివాసం ఉంటున్న భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భూములపై హక్కులు లేకపోవడంతో వాటిని విక్రయించుకోలేక, ఇతర అవసరాలకు వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పేదల భూముల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

2006 అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకుండా, గిరిజనులు, ఇతర అర్హులైన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమని ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం కల్పించిన భూముల్లో ట్రాక్టర్లతో భూమిని చదును చేయకుండా, నాగళ్లతోనే వ్యవసాయం చేయాలని అటవీశాఖ అధికారులు నిబంధనలు విధిస్తున్నారని విమర్శించారు. గిరిజనులపై కేసులు నమోదు చేస్తున్న అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేసి, వారి సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదల భూముల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేయడంతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించాలని అన్నారు.

రైతుల నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్లు తీసుకోవడం అప్రజాస్వామికం

రబీ సీజన్‌ కోసం విత్తనాలు కొనుగోలు చేసేందుకు వెళ్తున్న రైతుల నుంచి వ్యాపారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) సెల్ఫ్‌ డిక్లరేషన్లపై సంతకాలు తీసుకుంటున్నారని ప్రభాకర్ ఆరోపించారు. వరి పంట సాగు చేస్తే తమకు బాధ్యత లేదని, విద్యుత్‌ కొరత ఏర్పడినా తమను ప్రశ్నించవద్దని రాయించుకుని సంతకాలు తీసుకోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఇటువంటి విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

నవంబర్ 2న ఛలో సబ్‌ కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

పేదల భూములపై హక్కులు కల్పించడం, 22-ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించడం, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం, రైతుల సమస్యలను పరిష్కరించడం తదితర డిమాండ్ల సాధన కోసం నవంబర్ 2న నిర్వహించే ఛలో సబ్‌ కలెక్టర్ కార్యక్రమంలో రైతులు, పేదలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభాకర్ పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.

ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ మండల కార్యదర్శి కె. రాజేశ్వర్ మాట్లాడారు. AIUKS ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రిక్క దామోదర్, డివిజన్ ఉపాధ్యక్షుడు జి. నడ్పి నర్సయ్య, డివిజన్ నాయకులు ఎం. శ్రావణ్, బి. మోహన్, మండల నాయకులు అంబిక గంగాధర్, ఎస్. ధర్మపురి, జి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్…

0
తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ కల్వర్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి వాహనాల వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: నిజామాబాద్...

ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన వాగ్దేవి పాఠశాలలో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో...

మహిళల హక్కుల పరిరక్షణకు ‘మిషన్ అపరాజిత’ అండ…

0
మహిళల హక్కుల పరిరక్షణకు ‘మిషన్ అపరాజిత’ అండ సఖి వన్ స్టాప్ సెంటర్ పోస్టర్‌, పాంప్లెట్లను ఆవిష్కరించిన ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: మహిళల హక్కుల పరిరక్షణకు, గృహహింస...

ధర్పల్లి: 757 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌–తెలుగు నిఘంటువుల పంపిణీ…

0
ధర్పల్లి: 757 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌–తెలుగు నిఘంటువుల పంపిణీ PM SHRI పథకంలో భాగంగా విద్యార్థులకు నిఘంటువుల అందజేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని తెలంగాణ ఆదర్శ...

ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా…

0
ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా అక్రమంగా చెట్లు నరికిన వ్యక్తిపై వాల్టా చట్టం-2002 ప్రకారం కేసు నమోదు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

Translate »
error: Content is protected !!