Homeత్రిశూల్ న్యూస్నిజామాబాద్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి.. త్వరలో నితిన్ నబీన్ పర్యటనకు అవకాశం!

నిజామాబాద్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి.. త్వరలో నితిన్ నబీన్ పర్యటనకు అవకాశం!

నిజామాబాద్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి.. త్వరలో నితిన్ నబీన్ పర్యటనకు అవకాశం!

త్వరలో నిజామాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. ఎంపీ అర్వింద్ విజ్ఞప్తికి సానుకూల స్పందన…

నిజామాబాద్, నవంబర్ 7: భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో చేపడుతున్న వివిధ యాత్రలు, కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పర్యటించి, యాత్ర నిర్వహించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీకి ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని తెలిపారు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వివరించారు. జాతీయ స్థాయి నాయకత్వం నిజామాబాద్‌లో పర్యటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపడంతో పాటు, ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

ఎంపీ అర్వింద్ విజ్ఞప్తిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని, పర్యటన తేదీలు, కార్యక్రమాలు ఖరారైన అనంతరం నిజామాబాద్‌లో కూడా యాత్ర నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.

జాతీయ అధ్యక్షుడు తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించడం పట్ల ఎంపీ అర్వింద్ సంతోషం వ్యక్తం చేశారు. దీపావళి పండుగ అనంతరం ఢిల్లీలో నితిన్ నబీన్‌ను ప్రత్యక్షంగా కలిసి నిజామాబాద్ పర్యటనకు అధికారికంగా ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ పర్యటన ఖరారైన తర్వాత నిజామాబాద్ పర్యటనకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు, కార్యక్రమాల రూపకల్పన చేపడతామని ఎంపీ అర్వింద్ తెలిపారు. జాతీయ అధ్యక్షుడి పర్యటనతో నిజామాబాద్‌లో పార్టీ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత లభించడంతో పాటు, కార్యకర్తలకు జాతీయ నాయకత్వంతో నేరుగా మమేకమయ్యే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి రేషన్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు…

0
ధర్పల్లి రేషన్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని రేషన్ షాపులను శనివారం సివిల్ సప్లై అధికారి రవి తనిఖీ చేశారు....

పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి…

0
పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి.. రామారెడ్డి ఎస్సై మురళి సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం రామారెడ్డి: మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన రామారెడ్డి ఎస్సై మురళి పలు భద్రతా సూచనలు చేశారు. పండుగల...

రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్…

0
రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్.. మరో రెండేళ్లలో నిన్ను, కాంగ్రెస్ పార్టీని పాతిపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు! తెలంగాణ ప్రజలు మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.. అసహనంతో...

మహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం!

0
మహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం! ఉదయం నుంచి వేరుశనగ విత్తనాల కోసం పడిగాపులు.. రైతుల ఇబ్బందులపై స్పందించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు...

కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట!

0
కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట! జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ గడిల లింగం కామారెడ్డి :తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల...

Translate »
error: Content is protected !!