Homeకామారెడ్డి జిల్లాకామారెడ్డిలో 108 యజ్ఞ గుండాలతో శ్రీ చండీ మహాయజ్ఞం.. శ్రీ మహారుద్ర యజ్ఞానికి భారీ ఏర్పాట్లు...

కామారెడ్డిలో 108 యజ్ఞ గుండాలతో శ్రీ చండీ మహాయజ్ఞం.. శ్రీ మహారుద్ర యజ్ఞానికి భారీ ఏర్పాట్లు…

కామారెడ్డిలో 108 యజ్ఞ గుండాలతో శ్రీ చండీ మహాయజ్ఞం.. శ్రీ మహారుద్ర యజ్ఞానికి భారీ ఏర్పాట్లు

లోక కల్యాణం, ధర్మరక్షణ, దేశ రక్షణ సంకల్పంతో మహాయజ్ఞం…

త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం

కామారెడ్డి జిల్లా : లోక కల్యాణం, ధర్మరక్షణ, దేశ రక్షణ సంకల్పంతో కామారెడ్డి పట్టణంలో శ్రీ చండీ మహాయజ్ఞ సహిత శ్రీ మహారుద్ర యజ్ఞం నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కామారెడ్డిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది.

సనాతన హిందూ ధర్మ జాగృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ సద్గురు మహాదేవ స్వామీజీ పర్యవేక్షణలో 108 యజ్ఞ గుండాలతో మహాయజ్ఞాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైదిక నిర్వాహకులుగా శ్రీ భువనేశ్వర స్వామీజీ, ఆచార్య యం. శశిధర (గౌతమ్) స్వామీజీ వ్యవహరించనున్నారు.

రవి పుష్యా యోగం కలిగిన పవిత్రమైన రోజున ఉదయం 7 గంటలకు గోపూజ, ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, అష్టదిక్‌పాలకుల కల్పన, నవగ్రహారాధన, యోగినీ మండప పూజ, ప్రధాన కలశ పూజ, మండపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అనంతరం ఉదయం 9 గంటలకు అగ్ని ప్రతిష్ఠతో హోమ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్ణాహుతి, ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు, హిందూ బంధువులు, కామారెడ్డి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యజ్ఞాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

వేదిక: ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం, కామారెడ్డి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ…

0
వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ రక్తహీనత నివారణకు సమష్టిగా కృషి చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ... నిజామాబాద్ జిల్లా : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు...

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ…

0
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం హైదరాబాద్ : ఏఐసీసీ...

ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత…

0
ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత తల సేమియా చిన్నారులకు అండగా నిలుద్దాం ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల...

భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం…

0
భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం మహిళల హక్కులు, బాలల రక్షణపై భక్తులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సఖి...

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది…

0
ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు : ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ సంవిధాన్ ప్రచార...

Translate »
error: Content is protected !!