కారేగాంలో ఘనంగా కార్తీక మాస దీపారాధన వేడుకలు
స్వయంభు మహాదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు.. భక్తులతో కిటకిటలాడిన ఆలయం…
త్రిశూల్ న్యూస్ పోతంగల్ మండల్ రిపోర్టర్ ఏ గణేష్
నిజామాబాద్ జిల్లా : పోతంగల్ మండలం కారేగాం గ్రామంలోని స్వయంభు మహాదేవుని ఆలయంలో కార్తీక మాస దీపారాధన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వయంభు మహాదేవుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక మాస దీపాలను వెలిగించి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
ఈ కార్యక్రమంలో పలు గ్రామాల పెద్దలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలతో కారేగాం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

























