భీమ్ గల్ పట్టణ వ్యాపారస్తుల కు ప్రజలకు అందరికి వర్షాకాల పరిశుభ్రత జాగ్రత సూచనలు చేసిన మున్సిపల్ కమిషనర్ గజానంద్
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్ గల్ పట్టణంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, చికెన్, మటన్ షాప్స్, బేకరి, చైనీస్ సెంటర్లు, పరిశుభ్రత పాటించాలి, నాణ్యమైన పరిశుభ్ర మైన, స్వచ్ఛమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని మున్సిపల్ కార్యదర్శి కోరారు. ముఖ్యంగా చికెన్ మటన్ సెంటర్ ల వారు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు వారి దగ్గర వెలువడుతున్న చెత్తను మొఘల్ చెరువు, రాతం చెరువు ప్రాంతాల్లో ఆ యొక్క చెత్తను వేస్తూ కలుషితం చేస్తున్నారని వివిధ సందర్భాల్లో కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి ఇకపై వ్యాపారాలు నిర్వహించే వారు, మటన్ సెంటర్లు చికెన్ సెంటర్లు ఎవరైనా మీ దగ్గర వెలువడే చెత్తను మున్సిపల్ వాహనం లో మాత్రమే వేయాలి. చెరువుల దగ్గర, వేరే ఇతర ప్రాంతాల్లో పాడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, లేనిచో జరిమానా తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీడియా ముఖంగా భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ కోరారు.




















