బర్దిపూర్ గ్రామంలో వర్షాలు కురవాలని కప్పతల్లి, గ్రామదేవతలకు నీళ్లు పోసిన గ్రామస్తులు…
శుక్రవారం : 03/07/26/ త్రిశూల్ న్యూస్ డిచ్ పల్లి మండల్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో సకాలంలో మంచి వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా కప్పతల్లి, గ్రామదేవతలకు నీళ్లు పోసే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, మిద్దొడ్డి దాసు, నిరడి పద్మారావు, ఈగ గంగారెడ్డి, మేక కిష్టారెడ్డి, ఈగ సుధాకర్ రెడ్డి, పైడిపల్లి రవి, పోలా చిన్న రాములు తదితరులు పాల్గొన్నారు.

























