ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములైన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
ఎన్యూమరేషన్ ఫారం అందజేసిన ఎమ్మార్వో, బీఎల్‌వోలు, ఏ ఒక్క అర్హత గల ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా పనిచేయాలి: ఎమ్మెల్యే
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో వినయ్ సాగర్, బీఎల్‌వోలు రజిత, లావణ్య, నరేష్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అధికారులు పూర్తి పారదర్శకతతో, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా, ఏ ఒక్క అర్హత గల ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అలాగే ప్రజలు కూడా ఈ ప్రక్రియకు సహకరించి, అవసరమైన వివరాలను అధికారులకు అందజేసి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు.






















