మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మాన్‌పల్లి గ్రామంలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి ఈ నెల 4వ తేదీన రాష్ట్ర మంత్రి సీతక్క హాజరుకానున్న నేపథ్యంలో, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యక్రమ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతల కిషన్, నాయకులు ఉమ్మాజీ నరేష్, పొలసాని శ్రీనివాస్, రాంచందర్ గౌడ్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబర్ సింగ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.






















