Homeతెలంగాణఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత" – ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి...

ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత” – ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…

ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత” – ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…

SIR ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు భాగస్వామి కావాలి.. ప్రజలకు ఎమ్మెల్యే పిలుపు

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ 

మోపాల్, జూలై 17:రాజ్యాంగం ప్రతి భారత పౌరుడికి కల్పించిన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.

మోపాల్, ముదక్‌పల్లి గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను గురువారం ఎమ్మెల్యే పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు డబుల్ ఓట్లు, షిఫ్టింగ్, మరణించిన వారి ఓట్ల తొలగింపు వంటి అంశాలపై అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 85 శాతం మేర SIR ప్రక్రియ పూర్తికావడం అభినందనీయమని అన్నారు. మిగిలిన అర్హులైన ప్రతి ఓటరిని కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసి ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం బీజేపీపై ఎమ్మెల్యే విమర్శలు చేస్తూ, బీజేపీ కేవలం ఓటు చోరీకే పరిమితం కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారంలో కూడా దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన, SIR ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాయని తెలిపారు.

ప్రతి అర్హుడైన ఓటరు తప్పనిసరిగా SIR ప్రక్రియలో పాల్గొని తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల అప్రమత్తతతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని, ప్రతి ఓటు అమూల్యమైనదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార సంస్థ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

Translate »
error: Content is protected !!