హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ట్రాఫిక్ మళ్లింపు…
తెలంగాణ : బంజారాహిల్స్ జగన్నాథ ఆలయ రథయాత్రల సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొదటి యాత్ర ఎన్టీఆర్ స్టేడియం నుండి నాంపల్లి వరకు, రెండో యాత్ర బంజారాహిల్స్ రోడ్ నెం.12 ఆలయం వద్ద జరుగుతుంది. మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్ నుండి జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలను రోడ్ నెం.10, ఎన్టీఆర్ భవన్ వైపు మళ్లిస్తారు. టోలిచౌకి, మాదాపూర్ నుండి వచ్చే వాహనాలను చెక్ పోస్ట్ మీదుగా మళ్లిస్తారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.























