ధర్పల్లిలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి, జూలై 23 : ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వెంకటేష్ పాల్గొని ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన పలు కీలక అంశాలను రైతులకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు విధానాలు, మొక్కల నాటడం నుంచి నిర్వహణ వరకు పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, మార్కెటింగ్ అవకాశాల గురించి రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఆయిల్ పామ్ పంట రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం అందించే లాభదాయకమైన వాణిజ్య పంట అని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు ఆసక్తి చూపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

























