బీసీ స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం – పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ వి. భుజంగరావు…
బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కోచింగ్ లకై దరఖాస్తులు ఆహ్వానించే పోస్టర్ ను ఈరోజు నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వి.భుజంగ రావు ఆవిష్కరించారు. బిసి స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే యు.పి.ఎస్.సి సివిల్స్ 9 నెలల ఉచిత శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 07.08.2026 మరియు బిసి స్టడీ సర్కిల్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే Groups,SSC, RRB, పోలీస్ నియామక పరీక్షల కోసం నిర్వహించే ఉచిత ఐదు నెలల శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేటకు చివరి తేదీ 14.08.2026 పేర్కొన్నారు. పూర్తి సమాచారము మరియు అప్లై చేసుకొనుటకు website: tgbcstudycircle.cgg.gov.in ను సందర్శించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డివబిసిడివో శ్రీమతి రజిత మరియు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ సి.హెచ్.వెంకన్న పాల్గొన్నారు.























