టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం…
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో మూడు సంవత్సరాల అప్రెంటిస్ శిక్షణ కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ తెలిపారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఇంజినీరింగ్ (ఐటీ), డిప్లొమా, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు (బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ) అర్హులని తెలిపారు. 2022 విద్యా సంవత్సరం లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10, 2026 వరకు NATS 2.0 పోర్టల్‌లో నమోదు చేసుకుని TGSRTC Nizamabad Region ఎంపిక చేసుకుని దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
టీజీఎస్‌ఆర్టీసీ నిబంధనల ప్రకారం మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, శిక్షణ కాలంలో ప్రతినెలా స్టైఫండ్ చెల్లిస్తారని తెలిపారు.
ఖాళీల వివరాలు:
ఇంజినీరింగ్/డిప్లొమా (ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఏఐ, మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్) – 5 పోస్టులు
నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు (బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ) – 13 పోస్టులు
అర్హతలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలకు NATS 2.0 పోర్టల్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

























