పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు కార్యాక్రమం…
నిజామాబాద్ పోలీస్ శాఖలో జులై 31న వదవి విరమణ నేపద్యంలోని వారి వివరాలు
జూలై నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది వివరములు
1) * వి.శివరాం, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి.టి.సి, జాన్కంపేట్ నిజామాబాద్ మొత్తం సర్వీస్ 42 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి *పదవీ విరమణ* పొందినారు.
2.* చిట్టమల్ల ముత్తయ్య, ఆర్.ఎస్.ఐ, ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్. మొత్తం సర్వీసు పోలీస్ శాఖలో (36) సంవత్సరాలు పూర్తి చేసి నేడు *పదవి విరమణ* పొందినారు.
3.* కంటేదారి లక్ష్మణరావు, ఏ.ఆర్. ఎస్.ఐ, ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ ,నిజామాబాద్ పోలీస్ శాఖలో ( 42 ) సం|| ల సర్వీసు పూర్తి చేసి ” *పదవి విరమణ*” పొందినారు.
నేడు వీరి *పదవి విరమణ*” వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వ హించడం జరిగింది. వీరికి శాలువలతో సత్కరించి” పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు (జ్ఞాపికలతో) ” ఘనంగా సత్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్, మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని , మీరు పోలీస్ డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని , మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు.
ఈ వీడ్కోళ్లుసందర్భంగా అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ , సి.టి.సి,ఎ.సి.పి, రాజశేఖర్,ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్ ఏ.సి.పి శ్రీరాములు ఆఫీస్ సూపర్డెంట్లు శంకర్ , ఎ. జగతి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , రిజర్వు ఇన్స్పెక్టర్ (అడ్మిన్) ధరణి కుమార్, (ఎం.టీ.ఓ) ఎస్.శేఖర్ బాబు , (వెల్ఫేర్ / హోంగార్డ్స్ ) సతీష్ ,మరియు పదవి విరమణ వారి కుటుంబ సభ్యులు హజరుకావడం జరిగింది.

























