ఉప్లూర్ గ్రామంలో ప్రగతి గ్రామ సమైక్య జనరల్ బాడీ సమావేశం నిర్వహణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో ఈరోజు ప్రగతి గ్రామ సమైక్య జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ గారు ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం గ్రామాభివృద్ధికి ఎంతో కీలకమని, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ సకాలంలో చెల్లిస్తున్న ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
అనంతరం మహిళా సంఘాల నిర్వహణ, పొదుపు, రుణాల వినియోగం, సంఘాల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో నూతన VO మరియు OBలను ఎన్నిక చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీసీ నవీన్ కుమార్, పాలెం సర్పంచ్ రాధ, VOA అనూష, పాత గ్రామ సమైక్య పదాధికారులు గాయత్రి, రుక్సానా, నవీన, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























