దేవక్కపేటలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్‌గల్ మండలం, ఆగస్టు 7: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని దేవక్కపేట గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జననం అనంతరం వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని అధికారులు వివరించారు. తల్లిపాలు శిశువుకు సులభంగా జీర్ణమవుతాయని, తల్లులకు రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయని తెలిపారు. తొలి ఆరు నెలల పాటు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం పౌష్టికాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీడీపీవో జ్ఞానేశ్వరి, సూపర్వైజర్ విజయరాణి, గ్రామ సర్పంచ్ పూజ అజయ్, అంగన్‌వాడీ టీచర్లు రజిత, కరుణ, సరిత, సుశీల, శ్రావణి, అనూష, కనక, ఆయాలు, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

























