లిటిల్ హార్ట్స్ హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించిన ‘మన ఊరు–మన బాధ్యత’ కార్యక్రమం…
జ్యోతి ప్రజ్వలనతో ‘మన ఊరు–మన బాధ్యత’ కార్యక్రమానికి శ్రీకారం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి: సమాజ అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో కీలకమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ‘మన ఊరు–మన బాధ్యత’ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం, ప్రజలు కూడా బాధ్యతగా ముందుకు వచ్చి పరిశుభ్రత, పచ్చదనం, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామాన్ని సొంత ఇంటిలా భావించి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.
‘మన ఊరు–మన బాధ్యత’ వంటి కార్యక్రమాలు సమాజంలో బాధ్యతాయుత భావనను పెంపొందించడంతో పాటు ప్రజల్లో సేవా స్ఫూర్తిని పెంచుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, అందరూ కలిసి పనిచేస్తే గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























