రాష్ట్ర ప్రభుత్వం ఆగష్టు 15న కొత్త పెన్షన్ విధానాన్ని ప్రారంభిస్తున్నది…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ధర్పల్లి గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ మాట్లాడుతు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆగష్టు 15న నాడు కొత్త పెన్షన్ విధానాన్ని ప్రారంభిస్తున్నది. దీని కోసం దర్పల్లి గ్రామములోని అర్హులైనవారు ప్రభుత్వం 7 రకాల పెన్షన్ విధానాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నది.
అందులో నుంచి మొదటిది:
వితంతు పెన్షన్
ఒంటరి మహిళ పెన్షన్
వికలాంగుల పెన్షన్
గీత కార్మికుల పెన్షన్
చేనేత కార్మికుల పెన్షన్
బోధకాల పెన్షన్
డయాలసిస్ పెన్షన్
ఈ 7 రకాల పెన్షన్లు మాత్రమే ఆగష్టు 15 నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైంది. దీనికి అర్హులైన వారు దర్పల్లి గ్రామ పంచాయతీలో వచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క దర్పల్లి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.
దీని కోసం వారు చేయవలసిన పని:
మొదటగా గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు)
వయస్సు ప్రూఫ్ కోసం ఓటర్ ఐడీ కార్డు
బ్యాంక్ ఖాతా
ఒక ఫోటో
ఇన్కమ్ సర్టిఫికేట్
ఈ 5 రకాల జిరాక్స్ లు తీసుకొని గ్రామ పంచాయతీలో వచ్చి అప్లై చేసుకోవాల్సిందిగా ప్రతి దర్పల్లిలో ఉన్న అర్హులైన వారిని దర్పల్లి గ్రామ పంచాయతీ తరఫున కోరడం జరుగుతుంది.
ఎవరైనా సరే గ్రామ పంచాయతీలోనే వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరి మాటలు నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దు. ‘మేము చేయిస్తాం, మాకు ఇవ్వండి’ అనే ఎవరి మాటలు నమ్మవద్దు. దర్పల్లి గ్రామ పంచాయతీ నుంచే అన్నీ ఎంపిడిఓ ఆఫీస్ కు పంపడం జరుగుతుంది గనుక దర్పల్లి గ్రామ పంచాయతీలోనే అందరూ అప్లై చేసుకోవాలి. మీసేవ ద్వారా కూడా అప్లై లేదు. గ్రామ పంచాయతీ నుంచే ఎంపిడిఓ ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది గనుక అందరూ ఈ విషయాన్ని గమనించి గ్రామ పంచాయతీకి వచ్చి అప్లై చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది.”అని తెలిపారు

























