లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో బోనాల పండుగని ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు పోతురాజుల వేషధారణలో శివసత్తుల వేషధారణలో గ్రామదేవతల వేషధారణలో ఆకర్షణీయంగా తయారయ్యారు. తర్వాత బోనాలను తలపై ఎత్తుకొని పాఠశాల నుండి పోచమ్మ గుడి వద్దకు వెళ్లి అమ్మవారికి బోనాలు చీరే సారే సమర్పించి అమ్మవారిని భక్తితో వేడుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి అంటురోగాలు ప్రజల కుండా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి మొక్కులు మొక్కారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ షఫీ, మేనేజింగ్ డైరెక్టర్ సనా, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణన్ నాయర్, ప్రైమరీ ఇన్చార్జ్ బిను ఏవో ప్రకాష్ భాను ప్రకాష్ , ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

























