Homeతెలంగాణకాలూర్-ఖానాపూర్ ఊర చెరువును ఆహ్లాదకరంగా అభివృద్ధి చేయాలి...

కాలూర్-ఖానాపూర్ ఊర చెరువును ఆహ్లాదకరంగా అభివృద్ధి చేయాలి…

“కాలూర్-ఖానాపూర్ ఊర చెరువును ఆహ్లాదకరంగా అభివృద్ధి చేయాలి”

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి.రూ.3.14 కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి పనులు గుర్రపు డెక్క తొలగించి చెరువును పరిశుభ్రంగాఉంచాలి.చెరువు గట్టు వెంబడి వాకింగ్ ట్రాక్, రేలింగ్ గ్రిల్స్, బ్యూటిఫికేషన్పనులు.పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశo.నీటి నిల్వతో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు చేపట్టాలి.నిజామాబాద్ నగరానికి చేరువగా ఉన్న కాలూర్-ఖానాపూర్ డివిజన్ నంబర్ 1 ఊర చెరువును పరిశుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అధికారులను ఆదేశించారు.డివిజన్ నంబర్1పరిధిలోనికాలూర్–ఖానాపూర్ ఊర చెరువును ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. చెరువు అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ చెరువును ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.రూ.3.14 కోట్ల అంచనా వ్యయంతో చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.1 కోటి విలువైన పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని, చెరువు గట్టు వెంబడి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. అలాగే బ్యాలెన్స్ రేలింగ్ గ్రిల్స్, బ్యూటిఫికేషన్ తదితర మిగిలిన పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు.వర్షాలు,ఇతర మార్గాల ద్వారా చెరువులోకి వచ్చే నీటిని సాధ్యమైనంత మేర నిల్వ ఉంచి భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.చెరువు అభివృద్ధి పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలకు వాకింగ్,సేదతీరేందుకు అనువైన ప్రదేశంగా మారడంతో పాటు పరిసర ప్రాంతాల అందం కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.చెరువు అభివృద్ధి పనులనుఅధికారులుఎప్పటికప్పుడుపర్యవేక్షిస్తూ,ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ముప్ప.గంగారెడ్డి,రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్,స్థానిక కార్పొరేటర్ అగ్గు భోజన్న,కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగారెడ్డి, ఉమ్మాజి నరేష్,పొలసాని. శ్రీనివాస్,హన్మండ్లు,కిరణ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!