విద్యుత్ షాక్తో మృతి చెందిన కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం…
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా మోహన్రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టార్ సదాశివ్ బచ్చగొని…
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ మోహన్రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రానికి చెందిన ముద్గుల సాయినాథ్ ఇటీవల విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు,ప్రజా ట్రస్ట్ ఛైర్మన్ భోస్లే మోహన్రావ్ పటేల్ సాయినాథ్ కుటుంబాన్ని పరామర్శించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధిత కుటుంబానికి తనవంతు అండగా నిలవాలనే ఉద్దేశంతో మోహన్రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ తరఫున సాయినాథ్ భార్య ముద్గుల అంజలికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో గ్రామస్థుల సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా మోహన్రావ్ పటేల్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడం,వారికి అవసరమైన సమయంలో సహాయం అందించడం తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో సర్పంచ్ హిజదొద్దీన్,మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్,వార్డు సభ్యుడు పోతన్న,మండల నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు.

























