ఎర్రకోటపై తొలిసారి ‘వందేమాతరం’
స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న తొలిసారిగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ గీతానికి ముందు ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించనున్నారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
పీఎం మోదీ ఎర్రకోట వద్దకు రాగానే వందేమాతరం ఆలపిస్తారని,అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ‘జనగణమన’గీతాన్ని ఆలపిస్తారని వెల్లడించారు.

























