చేనేత సహకార సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైన గుజ్జ రాజేశ్వరికి ఘన సన్మానం…
సీనియర్ సిటిజన్స్ ఫోరం, సుభాష్ నగర్, నిజామాబాద్ లో కార్యవర్గ సభ్యులైన గుజ్జ రాజేశ్వరి గారికి ఫోరం భవనం లో జరిగిన కార్యవర్గ సమావేశంలో *నిజామాబాద్ జిల్లా చేనేత సహకార సంఘానికి* జరిగిన ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా అధ్యక్షులు కాటిపల్లి నారాయణ రెడ్డి శాలువాతో, కార్యదర్శి డా.వంగ విజయ కుమార్ బొకే సమర్పించి ఘనంగా సత్కరించారు. కార్యవర్గ సభ్యులైన టి.భూమన్న,నల్లా రాజారెడ్డి,
దొంతి లక్ష్మారెడ్డి, కర్ణం వెంకట రెడ్డి
శ్రీరాములు, లింగయ్య, భూమయ్య, రవీంద్రనాథ్, గుజరాతీ రాజేశ్వర్, రంగయ్య, సిద్దిరాములు, సత్యనారాయణ,
సభ్యులు రాజన్న, తదితరులు హాజరై అభినందనలు తెలియజేశారు. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు వారిని సీనియర్ సిటిజన్స్ ఫోరంనకు సేవలతో పాటు సహాయ సహకారాలు అందచేయాలని కోరడమైనది. వారు కూడా సహ్రృధ్భావంతో సేవలు చేయగలనని విన్నవించారు.

























