Homeతెలంగాణపాతబస్తీ మెట్రో పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి...

పాతబస్తీ మెట్రో పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి…

హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి  పలు ఆదేశాలిచ్చారు.

ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ కారిడార్‌లో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లను జత చేయాలని చెప్పారు. ఇందుకు అవసరమైన కోచ్‌ల కొనుగోలు ప్రక్రియకు చర్యలు తీసుకోవాలన్నారు.

మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్‌కు సంబంధించి ప్రస్తుత సాంకేతికతపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి, అవసరమైన సలహాలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , సలహాదారులు రామకృష్ణారావు , ఎన్వీఎస్ రెడ్డి , మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ , అదనపు ఎండీ అజిత్ రెడ్డి  పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!