గ్రామ దేవతలకు ప్రత్యేక ముడుపులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో శ్రావణమాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రావణమాసంలో శని, సోమవారాల్లో చేపట్టే ఉపవాస దీక్షలు విజయవంతంగా సాగాలని, గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు విలేజ్ కమిటీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, కమిటీ సభ్యులు, పోతురాజులు, బీడీసీ సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






















