Homeతెలంగాణచెత్త సేకరణ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలి...

చెత్త సేకరణ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలి…

రోడ్లపై పశువులు సంచరించకుండా చర్యలు చేపట్టాలి కలెక్టర్ భవేష్ మిశ్రా…

డంపింగ్ యార్డు సందర్శన…

నిజామాబాద్, ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. రోడ్లపై ఎక్కడబడితే అక్కడ పశువులు సంచరించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ను ఆదేశించారు.

నాగారం శివారులోని డంపింగ్ యార్డును కలెక్టర్ గురువారం సందర్శించారు. నగర పాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికీ తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిలువ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ, ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా బయో మైనింగ్ సులభం అవుతుందని అన్నారు. వ్యర్ధాలను శుద్ధి చేస్తూ కంపోస్ట్ తయారీ కోసం ప్రతిపాదించిన మేరకు వేస్టేజ్ ప్రాసెస్సింగ్ యంత్రాల ద్వారా శుద్ధి ప్రక్రియ జరిపించాలన్నారు. కాగా, నగరంలో ప్రధాన మార్గాలలో రహదారులపై ఎక్కడబడితే అక్కడ ఆవులు, ఇతర పశువులు సంచరిస్తుండడం వల్ల ప్రజలు, ప్రత్యేకించి వాహన చోదకులు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పశువులు రోడ్లపై సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రోడ్లపై తిరిగే పశువులను గోశాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…

0
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో...

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

Translate »
error: Content is protected !!