టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టీ.జీ.ఎస్. ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో, పర్సనల్ ఆఫీసర్ శ్రీమతి టి. పద్మజ, A/O THULYA NAIK రీజినల్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన రీజినల్ మేనేజర్, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
అలాగే ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు టీ.జీ.ఎస్. ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోందని, ప్రయాణికుల భద్రత, సౌకర్యాల పెంపు కోసం అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

























