నందిపేట సుభాష్ గల్లీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని సుభాష్ గల్లీలో నాగమంతెన సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం స్థానిక సిద్ధార్థ పాఠశాల విద్యార్థులు వందేమాతరం, జనగణమన గీతాలను ఆలపించారు. జై జవాన్.. జై కిసాన్, భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా భారతంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య ఉద్యమంలో వీరోచిత పాత్ర పోషించి, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి బ్రిటిష్ పాలకులను గడగడలాడించారని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంతెన పంత అధ్యక్షులు, సంఘ అధ్యక్షులు, నాయకులు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

























