స్వాతంత్ర్య సమరయోధులు సదాస్మరణీయులే…!
వేల్పూరు మండలంలోని రామన్నపేట పడకంటి మొటాటి రెడ్డి సంఘం అధ్యక్షుడు పెద్దోళ్ల బాపురెడ్డి శనివారం సంఘం భవనం ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని సంయుక్తంగా ఆలపించారు. తదనంతరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ స్వాతంత్ర్య సాధన కొరకై రక్తాన్ని చిందించి ఈ నేలకొరిగింది స్వాతంత్ర సాధన కొరకే అందుకే. అందుకే వారి త్యాగాలు వెలకట్టలేనివి. సదాస్మరణీయులే అని అన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.























