ధర్పల్లిలో శ్రీ లక్ష్మీనరసింహ వనసంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహ వనసంరక్షణ సమితి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ కమిటీ చైర్మన్ జంగేటి నడిపి పోచన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మూడావత్ హరిలాల్, కోశాధికారి బిల్లా పురుషోత్తం, సలహాదారులు కడవతు రాయలు, నరేష్, మల్లేశం, సాయిలు, సమితి సభ్యులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

























