కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ కాసార్ల గోదావరి, కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంతరావు, మున్సిపల్ కౌన్సిలర్లు అంజాద్, మహేష్, లడ్డు, రామ్మోహన్, అఖిల, హర్షిత, సత్యం, గణేష్, హఫీజ్, ప్రభాకర్, లక్ష్మణ్, మన్సూర్, లోలం శ్రీనివాస్, శ్రీకాంత్, లక్ష్మణ్ రెడ్డి, వంశీకృష్ణ, భాను, రాహుల్, మధు, అరవింద్, శ్రీధర్ రెడ్డి, ప్రీతి, వినోద, మాధవి, రాణి, కో-ఆప్షన్ సభ్యులు అలీ భీన్ అబ్దుల్లా, ముబాషీర్‌తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























