ప్రతి సోమవారం… ఇకనుంచి మండల స్థాయి ప్రజావాణి….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…
ప్రజల సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించబడుతుందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ లో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అందుబాటులో ఉంటారని ప్రజలు తమ సమస్యలను సోమవారం జరిగే మండల ప్రజావాణి కార్యక్రమంలో విన్నవించుకోవచ్చని నందిపేట ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందని ప్రజలు తమ సమస్యలను విజ్ఞప్తి చేసుకోవచ్చని ఆయన అన్నారు.























