చౌట్‌పల్లిలో అక్రమ లిక్కర్ పట్టివేత.. ఒకరి అరెస్ట్…
కమ్మర్‌పల్లి, ఆగస్టు 16: కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మానస తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైన్‌షాపులు మూసివేయడంతో, మహేష్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. సమాచారం మేరకు దాడి చేసి, అక్రమంగా విక్రయిస్తున్న లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని, మహేష్‌ను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
ఈ దాడిలో కమలాకర్, దిగంబర్, శివకుమార్, సతీష్, జలపతి, మమత, రజిత తదితరులు పాల్గొన్నారు.

























