యాదవ హక్కుల కమిటీ అధ్యక్షుడిగా రాజ్‌కుమార్ ఏకగ్రీవ ఎన్నిక…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల యాదవ హక్కుల కమిటీ అధ్యక్షుడిగా రాజ్‌కుమార్‌ను ఆదివారం జిల్లా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమిల శ్రీనివాస్, వీఢీసీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు రాజ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు.
యాదవుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ తన వంతు కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు రాజ్‌కుమార్ తెలిపారు. తనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసిన జిల్లా కమిటీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

























