ధర్పల్లి మండల కేంద్రంలో వాహనాల తనిఖీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల హెల్మెట్ వినియోగం, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ తదితరాలను పరిశీలించారు.
అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ప్రత్యేకంగా హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.

























