మేము ఓడిపోవడం కాదు.. విపక్షా ల డిపాజిట్లు గాల్లో కలిసిపోయేలా గెలుస్తాం…
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ శంకరావం ఆరోపణలను తిప్పికొట్టి న ఆర్మూర్ డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ అడేల్లి కార్తీక్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కె నగేష్…
టీ జి స్ ర్ టీ సి.లో గుర్తింపు యూనియన్ ఎన్నికల వేళ ఓటమి భయంతో విపక్ష నాయకులు దిగజారుడు రాజకీయం చేస్తున్నారని ఆర్మూర్ డిపోవర్కింగ్ ప్రెసిడెంట్ అడేల్లి కార్తీక్ మండిపడ్డారు. టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఒంటరిగా గెలవలేదని, ఓడిపోవడాని కిప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కార్మికుల మధ్య గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్న విపక్షాలకు, రాబోయేగుర్తింపు ఎన్నికల్లో ఆర్టీసీకార్మికులే తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. డిపోస్థాయిలో కార్మికులకు అందుబాటులో లేని ప్రతిపక్ష నాయకులు, ఎన్నికలు దగ్గర పడగానేఇటువంటిమైండ్ గేమ్లు ఆడుతున్నారు. ఆర్మూర్ డిపోలో డ్రైవర్ కండక్టర్ లు గ్యారేజ్ సిబ్బంది ముక్త కంఠంతో టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్కు మద్దతు ఇస్తూ న్నారనే భయంతోనే విపక్షాలు ఇష్టంమొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. “విపక్ష నాయకులకు నేను ఒకటేసవాల్ విసురుతున్నాను! కార్మికులారా, ఓటమి భయంతో వాళ్లు ఆడుతున్న నాటకాలకు మోసపోకండి. ‘మేము గెలవము, ఓడిపోవడానికి చూస్తున్నాం’ అని విపక్షాలు చేసేప్రచారాలు వారిమానసిక బలహీనతకు నిదర్శనం. ఆర్మూర్ డిపోలో కార్మికుడికి రాత్రింబవళ్లు అండగా ఉన్నదిమన టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ మాత్రమే. రాబోయేగుర్తింపు ఎన్నికల్లో ఆర్మూర్ డిపోతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మన యూనియన్ జెండాను ఎగరవేసి, విపక్షాల నోళ్లు మూయిస్తాం. కార్మిక సోదరులారా, మన ఐక్యతేమన బలం!























