ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న ఏఎస్ఐ చిటికెల జీవన్‌రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉద్యోగ సేవలకు ప్రశంసా పత్రాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చిటికెల జీవన్‌రెడ్డికి ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా జీవన్‌రెడ్డి ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























