శ్రావణమాసం ఇంటింటా మహాయజ్ఞం – శ్రీ పబ్బ శ్రీహరి ఇంట్లో ఘనంగా దేవయజ్ఞం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
శ్రావణమాసం సందర్భంగా “ఇంటింటా మహాయజ్ఞం” అనే సంకల్పంతో శ్రీ పబ్బ శ్రీహరి ఇంట్లో బుధవారం దేవయజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, పతంజలి యోగా సభ్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య దేవయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పతంజలి యోగా గురువు అంతిరెడ్డి మాట్లాడుతూ.. దేవయజ్ఞం అంటే దేవతల పట్ల కృతజ్ఞతను ప్రకటించడమేనని తెలిపారు. దేవయజ్ఞం నిర్వహించడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని అన్నారు.
అనంతరం శ్రీ పబ్బ శ్రీహరి కుటుంబ సభ్యులు పాల్గొన్న వారికి అల్పాహారం, తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు యోగా గురువు అంతిరెడ్డి, వెంకటస్వామి, శకుంతల, వెంకటరాజు, పబ్బ శ్రీహరి, మల్లారెడ్డి, అయిత బాలకిషన్, హరినాథ్, లింగంచారి, రజనీతి, రాధిక, లావణ్య, ప్రమీల, సుమలత తదితరులు పాల్గొన్నారు.

























