Homeత్రిశూల్ న్యూస్17 ఏళ్ళ ప్రియుడితో తాతను హత్య చేయించిన 13 ఏళ్ళ వయస్సు గల మనుమరాలు.. హత్య...

17 ఏళ్ళ ప్రియుడితో తాతను హత్య చేయించిన 13 ఏళ్ళ వయస్సు గల మనుమరాలు.. హత్య జరుగుతుండగా వీడియో కాల్‌లో వీక్షణ…

17 ఏళ్ళ ప్రియుడితో తాతను హత్య చేయించిన 13 ఏళ్ళ వయస్సు గల మనుమరాలు.. హత్య జరుగుతుండగా వీడియో కాల్‌లో వీక్షణ…

కేరళం ( తిరువనంతపురం ) : ఒక బాలిక తన ప్రియుడితో తాతను హత్య చేయించింది. క్లాత్‌తో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి ఆయనను చంపడాన్ని వీడియో కాల్‌లో చూసింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు నటించేందుకు ఆమె ప్రయత్నించింది. వృద్ధుడి హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు మైనర్లైన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని అలప్పుజలో ఈ సంఘటన జరిగింది. 67 ఏళ్ల తాత హత్యకు 13 ఏళ్ల మనుమరాలు కుట్రపన్నింది. ఆయన చిన్నకుమార్తె ప్రసవం కోసం అలప్పుజలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యింది. ఆమెకు తోడుగా ఉండేందుకు ఆయన భార్య అక్కడికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ వృద్ధుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు.

కాగా, ఆగస్ట్‌ 15న రాత్రివేళ బాలిక ప్రియుడైన 17 ఏళ్ల యువకుడితో పాటు మరో ముగ్గురు బాలురు ఆ ఇంటికి చేరుకున్నారు. వీడియో కాల్‌లో ఆమె సూచనల మేరకు బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా ఆ వృద్ధుడి గదిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అతడి కాళ్లు, చేతులు కట్టేశారు. నోటిలో గుడ్డ కుక్కారు. ఆ వృద్ధుడి తలను గోడకేసి బాదారు. ముక్కు, నోరును గుడ్డతో మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపారు. తాత హత్యను ఆ మనవరాలు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూసింది. వృద్ధుడ్ని చంపిన ఆ యువకులు 4.5 కాసుల బంగారంతో అక్కడి నుంచి పారిపోయారు.

ఆ మరునాడు ఇంట్లో ఏమీ జరుగనట్లు ఆ బాలిక నటించింది. చిన్నపిల్లలతో కలిసి రెండుసార్లు సమీపంలోని షాప్‌ వద్దకు వెళ్లి చిప్స్‌ ప్యాకెట్లు కొన్నది. తన తాత తలుపు తీయడం లేదని స్థానికులకు ఆమె చెప్పింది. మద్యం సేవించి నిద్రపోతుండవచ్చని షాపు వ్యక్తితో అన్నది.

మరోవైపు ఆ వృద్ధుడి గది తలుపును బలవంతంగా తెరిచి చూసిన బంధువులు అతడు హత్యకు గురైనట్లు తెలుసుకుని షాక్‌ అయ్యారు. అయితే తాత మరణించినప్పటికీ స్కూల్‌కు వెళ్లేందుకు ఆ బాలిక యూనిఫాం ధరించి సిద్ధమైంది. పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉన్నదని ఒక షాపు వ్యక్తికి చెప్పింది.

వృద్ధుడి హత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో బంగారం మాయం కావడంతో తొలుత దొంగల పనిగా అనుమానించారు. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర సాంకేక ఆధారాలతో దర్యాప్తు చేసిన తర్వాత మనమరాలే తన ప్రియుడితో కలిసి తాతను హత్య చేయించినట్లు తెలుసుకుని పోలీసులు షాక్‌ అయ్యారు. ఆ బాలికతో పాటు ఆమె ప్రియుడైన 17 ఏళ్ల యువకుడు, నేరంలో పాల్గొన్న మరో ముగ్గురు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

కాగా, తాత తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయనపై పగ పెంచుకున్నట్లు ఆ బాలిక పోలీసులకు చెప్పింది. అయితే ఈ నేరానికి డబ్బు ఒక కారణం కావచ్చని పోలీస్‌ అధికారి తెలిపారు. ఆ బాలిక మొబైల్‌ ఫోన్‌, ఆమె ప్రియుడు బైక్ కొనాలనే ఉద్దేశంతో ఈ కుట్రకు పాల్పడినట్లు చెప్పారు. ఆ యువకులు మాదకద్రవ్యాలు వాడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మైనర్లైన నిందితులను జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. పెద్దల తరహాలో వారి విచారణ కోసం ‘జువెనైల్ జస్టిస్ బోర్డు’ను కోరతామని అన్నారు.

మరోవైపు ఈ విషాద సమయంలో ఆ వృద్ధుడి చిన్నకుమార్తె ఆడబిడ్డను ప్రసవించింది. వృద్ధుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అదే ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో చిన్నకుమార్తె ప్రసవం కోసం అక్కడే ఉన్న ఆయన భార్య మార్చురీలో ఉన్న భర్త మృతదేహాన్ని కడసారి చూసుకునే పరిస్థితి ఎదురుకావడం ఆ కుటుంబాన్ని మరింత కుంగదీసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

Translate »
error: Content is protected !!