హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
మీ భద్రత కోసం హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని భీంగల్ ఎస్సై సిహెచ్ తిరుపతి తెలిపారు.
శుక్రవారం నాడు ఎస్సై తిరుపతి మీడియాతో మాట్లాడుతూ..
సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు 22-08-2026 నుండి భీమ్‌గల్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపరాదని.
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన స్పష్టం చేశారు.
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే మోటార్ వెహికల్ యాక్ట్ (MV Act) ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చార్జ్‌షీట్ దాఖలు చేసి నేరుగా కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేశారు.
ఈ చర్యలు కేవలం జరిమానాల కోసం కాదని, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు తీసుకుంటున్న ముందస్తు భద్రతా చర్యలని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని, భీంగల్ పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు.
కావున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను రోడ్డుపై నడపవద్దు. మీ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపండి. ఆయన అన్నారు.

























