ఏడో వార్డులో డ్రైనేజీ పనులు ప్రారంభం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఏడో వార్డులో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మురికి కాలువల నిర్మాణం, మరమ్మతు పనులను ప్రారంభించారు. సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్ సహకారంతో వార్డు సభ్యుడు నిమ్మల వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా నిమ్మల వినయ్ గౌడ్ మాట్లాడుతూ.. తనను వార్డు సభ్యుడిగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు ప్రజలు, సభ్యుల సహకారంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామన్నారు. వార్డులో ఎక్కడెక్కడ మురికి కాలువలు అవసరం ఉన్నాయో గుర్తించి, అక్కడ కొత్త డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్‌తో పాటు చక్రపాణి, వినయ్ గౌడ్, శ్రావణ్, అజయ్, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.

























