Homeత్రిశూల్ న్యూస్రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బైక్ ర్యాలీ, మానవహారం

మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్, సీ.పీ, జిల్లా అధికారులు

నిజామాబాద్, ఏప్రిల్ 15 : రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీ.సీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అరైవ్ అలైవ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజామాబాద్ నగర పర్యటనకు బుధవారం విచ్చేసిన రాష్ట్ర రవాణా, బీ.సీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిజామాబాద్ చేరుకున్న మంత్రిని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్ద కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో పాటు అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, ఇతర జిల్లా అధికారులు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుండి పోలీసు బందోబస్తు మధ్య కాన్వాయ్ ద్వారా మంత్రి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కోసం చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీ కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వరకు చేరుకోగా, అక్కడ విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లా అధికారులతో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు మానవహారంలో భాగస్వాములు అయ్యారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని, ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తద్వారా అనేక కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. ఎన్ని చట్టాలు నిబంధనలు అమలు చేసినా, ప్రజలలో మార్పు రానంత వరకు ప్రమాదాలను నిలువరించడం సాధ్యం కాదని అన్నారు. దీనిని గుర్తిస్తూ పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో ప్రజలలో అవగాహన కల్పించడం కోసం అరైవ్ అలైవ్ పేరుతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రమాదాల నివారణకు తమవంతు దోహదపడాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులను తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించాలని, అలా కృషి చేసిన వారిని రహ్ వీర్ కింద రూ. 25 వేల నగదు ప్రోత్సాహకం ప్రభుత్వం ద్వారా అందజేయబడుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

Translate »
error: Content is protected !!