డిచ్‌పల్లి మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 16: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం వద్ద శ్రీ అయ్యప్ప స్వామి మందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గురుస్వామి ఉన్నికృష్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భూమి పూజ కార్యక్రమంలో పండితులు రాజేంద్ర త్రీసారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అశ్విని, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లి మండలంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి మందిర నిర్మాణం త్వరగా పూర్తికావాలని భక్తులు ఆకాంక్షించారు.

























