బాధిత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
బడా భీమ్‌గల్ : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన బడా భీమ్‌గల్ గ్రామానికి చెందిన దుమ్మాల లింబన్న భార్య కుటుంబానికి గ్రామ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన యూత్ సభ్యులు, తమ సంఘం ఆధ్వర్యంలో సమకూర్చిన రూ.25,000/- ఆర్థిక సాయాన్ని బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడం అత్యంత విచారకరమని, బాధిత కుటుంబానికి తమ వంతుగా ఈ చిన్నపాటి సాయం అందించామని తెలిపారు. యువత ఎల్లప్పుడూ సమాజ సేవలో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటుందని పేర్కొన్నారు. లింబన్న కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

























