ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ
బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యతతో పాటు తెలంగాణ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులతో పాటు కర్క గంగారెడ్డి, పాల్దిదాసు, చారి చంద్, దోర్నాల రాజశేఖర్, తెడ్డి శంకర్, సభావత్ రవీందర్, తాళ్ల రాము, నల్ల పెంటన్న, మల్లయ్య యాదవ్, జ్ఞానేశ్వర్, తిరుపతి, కేసారం శ్రీను, చిలుక నరేష్, మురళి, గంగామల్లు, కర్రల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

























