దుర్గామాత మండపానికి భూమిపూజ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి, దేవునిపల్లి: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవునిపల్లిలో దుర్గామాత మండపం ఏర్పాటుకు సోమవారం భూమిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఆలయ అర్చకులు శశికాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భూమిపూజ కార్యక్రమానికి వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, సొసైటీ డైరెక్టర్లు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
దుర్గామాత ఆశీస్సులతో ఉత్సవాలు విజయవంతంగా సాగాలని స్థానికులు ఆకాంక్షించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చైతన్య యూత్ క్లబ్ సభ్యులు తెలిపారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు కాసర్ల మాధవి-రవీందర్, భోజనగారి రేవతి-రాజు పాటిల్,
సొసైటీ డైరెక్టర్ నీలం లక్ష్మి, వెంకటి, బీఆర్ఎస్ నాయకులు పెద్దోళ్ల శశిధర్‌రావు,
చైతన్య యూత్ క్లబ్ అధ్యక్షుడు ద్యావరి నవీన్, కార్యదర్శి గోలి నరేష్,
ఉపాధ్యక్షుడు లీలం రవి, ద్యావరి నరేష్, దేవల శేఖర్, తూర్పు నరేష్, సురం మధు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

























