డిచ్ పల్లి మండలం కేంద్రo లో ఉపాధి హామీ కూలీల సమీకరణ పై అధికారుల దిశానిర్దేశం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం కేంద్రం లో ఉపాధి హామీ కూలీల సమీకరణపై అధికారుల దిశానిర్దేశం.ఒక్కో గ్రామం నుంచి 60 నుంచి 200 మంది వరకు కూలీలను సమీకరించాలని సూచన పీడీఆర్డీఏ ఆధ్వర్యంలో వీవీజీరామ్/వీబీజీ కార్యక్రమం కింద వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో నిర్వహించనున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఒక్కో గ్రామం నుంచి కనీసం 60 మంది నుంచి గరిష్ఠంగా 200 మంది వరకు ఉపాధి హామీ కూలీలను సమీకరించాలనిపంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు,మెట్లకు సూచించారు.ఈకార్యక్రమంలో డిచ్ పల్లి ఎంపీడీవో సాతు.ఉదయభాస్కర్,శ్రీనివాస్ పిఓపిఆర్.డి,ఏపీవో మంజుల,టెక్నికల్ అసిస్టెంట్లు,ఈసీలు పాల్గొని గ్రామాల వారీగా కూలీల సమీకరణ,కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.అధికారులు క్షేత్రస్థాయిలోసమన్వయంతోపనిచేసికార్యక్రమాన్నివిజయవంతం చేయాలని సూచించారు.























