భీంగల్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు.
రెండో రోజు గాయత్రి దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రెండో రోజు అమ్మవారు గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గాయత్రి దేవి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
అయ్యప్ప నగర్, శ్రీరామ్ నగర్, రాజారామ్ నగర్, విఘ్నేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా కాలనీల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

























