కరెంటు కోతలతో రైతులకు తీవ్ర ఇబ్బందులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా లో డిచ్ పల్లి మండలం లో గత కొన్ని రోజులుగా కరెంటు కోతలు తీవ్రమయ్యాయి వ్యవసాయానికి రోజుకు 9 గంటలు కూడా కరెంటు సరిగా ఇవ్వకపోవడంతో బావుల శాటర్ డబ్బా దగ్గర పడి కాపులు కాస్తు ఎదురుచూస్తున్న రైతులు, అప్రకటిత విద్యుత్ కోతల వల్ల రైతులు పంటలకు నీరు పెట్టుకోలేకపోతున్నారు, పొద్దున్నా పూట కరెంటు ఇస్తామని చెప్పి కరెంటు రోజు ట్రిప్ చేయడం నాణ్యమైన కరెంటు ఇవ్వకపోవడం వల్ల సరిగా కరెంటు ఉండడం లేదు,దీన్ని వల్ల రైతులు పొలాల్లో ఉండాల్సి వస్తోంది,ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయినాపట్టించుకోవడం లేదు,బావి బోర్లకు కరెంటు లేకపోవడంతో వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది,సరైన సమయంలో నీరు అందక పంటలు ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు,మండలంలో అప్రకటిత కరెంటు కోతలు వెంటనేఆపి,వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన 3 ఫేస్ కరెంటు ఇవ్వాలి,కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లను 24 గంటల్లోపు మార్చాలి,ప్రభుత్వం,విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించాలి ఎండిపోయిన పంటలను అధికారులు పరిశీలించి నష్టపరిహారం అందించాలి రైతులు కోరుతున్నారు.























